PM-MKSSY
మోదీ సర్కార్ శుభవార్త..ఈ పథకంతో చౌకగా రుణాలు..1 లక్ష 70 వేల కొత్త ఉద్యోగాలు
మత్స్య రంగంలో రాబోయే నాలుగేళ్లలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. మత్స్య రంగంలో.. ఉపాధి, ఉద్యోగాల కోసం వచ్చే నాలుగేళ్లలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రూ. 6,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా రైతులు, మహిళలు దీనివల్ల ప్రయోజనం పొందనున్నా.
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం(PM-MKSSY)ద్వారా రైతులతో పాటు మత్స్యకారులు, చేపల పెంపకం కూలీలకు కూడా చౌకగా రుణాలు అందుతాయి. బీమాతో ఉపాధిని ప్రారంభించడానికి అనేక అవకాశాలను పొందుతారు. మత్స్యశాఖలో కొత్త అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ భారీ ప్రకటన చేసింది.
మత్స్య రంగంలో ఉపాధి
Pradhan Mantri Matsya Kisan Samridhi Sah-Yojana(ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం)ద్వారా ప్రభుత్వం 50 శాతం అంటే రూ. 3,000 కోట్లు విడుదల చేస్తుంది. మిగిలిన 50 శాతం అంటే రూ. 3,000 కోట్లు ప్రైవేట్ రంగానికి సంబంధించిన పెట్టుబడుల రూపంలో వస్తాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం నుండి 2026-27 వరకు 4 సంవత్సరాల పాటు అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇది అమలు చేయబడుతుంది.
ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని మత్స్యకారులు, నీటి చేపల పెంపకందారులు, మత్స్య కార్మికులు, చేపల విక్రయదారులు పొందవచ్చు. దీంతో పాటుగా, కేంద్ర ప్రభుత్వం యాజమాన్య సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, భారతదేశంలో నమోదైన కంపెనీలు, సొసైటీలు, పరిమిత బాధ్యత భాగస్వామ్యం (LLP), సహకార సంఘాలు, సంఘాలు, స్వయం సహాయక బృందాలు వంటి గ్రామ స్థాయి సంస్థల రూపంలో కూడా ప్రభుత్వం సహాయం అందిస్తుంది. ఎస్‌హెచ్‌జిలు, ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌ఎఫ్‌పిఓలు) చేపల పెంపకం, ఆక్వాకల్చర్ వ్యాపారంలో నిమగ్నమై ఉన్న సూక్ష్మ,చిన్న సంస్థలు,స్టార్టప్‌లు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఆక్వాకల్చర్ ఫామ్‌లోని హెక్టారు నీటి విస్తీర్ణంలో రూ. 25,000 పరిమితికి లోబడి, ప్రీమియం ఖర్చులో 40 శాతం చొప్పున కేంద్ర ప్రభుత్వం ‘వన్-టైమ్ ఇన్సెంటివ్(One time incentive)’ అందిస్తుంది. ఒక రైతుకు గరిష్ట ప్రోత్సాహక మొత్తం రూ. 1,00,000, ప్రోత్సాహకానికి అర్హత కలిగిన గరిష్ట పొలం పరిమాణం 4 హెక్టార్లు.
© 2024. All rights reserved.